Sitaram Yechury | చెన్నైలో జన్మించి.. హైదరాబాద్ లో ఎదిగి.. ఢిల్లీలో విద్యాభ్యాసం.. సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే..!
Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఏచూరికి ఎంతో గుర్తింపు ఉంది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు.సీతారాం ఏచూరి చెన్నై లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. దీంతో ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది.హైదరాబాద్ ఆల్ సెయింట్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన అనంతరం దిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు.1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా టాప్ ర...