PMFBY Crop Insurance : పీఎం ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి? ఎలా క్లెయిమ్ చేయాలి ప్రయోజనాలేంటీ?
Pradhan Mantri Fasal Bima Yojana | భారతదేశంలో వ్యవసాయం చాలా ప్రముఖమైనది. పంటలు పండించే రైతులకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన ఆస్తి ఇది. రైతులు ఈ ఆస్తికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY Crop Insurance ) కింద బీమా చేసుకొని ఆర్థిక భరోసా పొందవచ్చు. ఇది వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..
PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) అంటే ఏమిటి?
PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంట బీమా పథకం. ఇది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇతర వ్యాధుల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. బీమా కంపెనీలు, బ్యాంకుల నెట్‌వర్క్ ద్వారా అమలవుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ బీమా పథకంగా నిలిచింది. ఇది 50 కోట్ల మంది రైతులకు ...