హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ ప్రత్యక్ష ప్రసారం
Aditya-L1 launch: హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శనివారం ఆదిత్య-ఎల్1 లాంచ్ కుసంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం (ఆన్‌లైన్) ద్వారా చూడవచ్చు. 'సూర్యుడికి సంబంధించిన విశేషాలు, ఆదిత్య-ఎల్ 1 మిషన్'పై సైన్స్ చర్చ కూడా జరుగుతుందని బిఎమ్ బిర్లా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం(hyderabad birla planetarium) డైరెక్టర్ కెజి కుమార్ తెలిపారు. " మధ్యాహ్నం 12 గంటలకు ‘Our Sun' పై ఓపెన్ హౌస్ క్విజ్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు బిర్లా ప్లానిటోరియంకు వచ్చి లాంచ్‌ని వీక్షించవచ్చు.. తరువాత క్విజ్‌లో పాల్గొనవచ్చు," అని తెలిపారు.ఆదిత్య L1 గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సూర్యుడి వైపు వెళ్లేందుకు భారతదేశం నుంచి ఇది మొట్టమొదటి మిషన్. 'ఆదిత్య' అంటే సూర్యుడు అని, ఎల్1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అని అర్థం. ఇది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఏడు వేర్వేరు పేలోడ్‌లను
తీసుకువెళుతుంది. వీ...