
Aasara Pensions | తెలంగాణలో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత
Aasara Pensions | ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నారని వెల్లడించింది.నివేదికల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి నెలవారీ పెన్షన్‌లతో పాటు ఆసరా పెన్షన్లు (Aasara Pensions) కూడా పొందుతున్నారు. వీరిలో 3,824 మంది మరణించగా, మిగిలిన 1,826 మంది రెండు రకాల పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ నుంచి వీరికి ఆసరా పింఛన్లను నిలిపివేసింది.ఒక్క ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే 427 మంది అక్రమంగా డబుల...