
Phase 2 Voting | రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమమాలిని, ఓం బిర్లా – ఎన్నికల ఫేజ్ 2లో కీలక అభ్యర్థులు మరెందరో..
Phase 2 Voting LokSabha Polls | రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు, బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు కీలక అభ్యర్థులుగా నిలిచారు. గత ఎన్నికల్లో వారు తమ తమ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు గత శుక్రవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో దాదాపు 65.5 శాతం ఓటింగ్ నమోదైంది.రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14 స్థానాలు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 7 చొప్పున పోలింగ్ జరగనుంది. అలాగే అస్సాం, బీహార్‌లో ఐదు చొప్పున, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో మూడు చొప్పున సీట్లు, మణిపూర్, త్రిపుర జమ్మూ మరియు క...