ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారత్ లో iPhone 16, iPhone 16 Plus విడుదలయ్యే రోజు ఇదే..
iPhone 16 | ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. అమెరికా కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్ లో గల స్టీవ్ జాబ్స్ థియేటర్లో 'యాపిల్ 'ఇట్స్ గ్లో టైమ్' అనే ట్యాగ్ లైన్ తో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎప్పటి మాదిగానే ఈ ఏడాది జరగనున్న ఈ ఈవెంట్లో ఐఫోన్16 ఫోన్ ను విడుదల చేసే చాన్స్ ఉంది. యాపిల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే అవకాశముంది. ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యాపిల్ 16 ఫోన్లను కూడా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే...