జార్జ్ సోరోస్ సంస్థతో సోనియాగాంధీకి లింక్.. కాంగ్రెస్ పై బిజెపి ఫైర్..
Congress Party | జార్జ్ సోరోస్ (George Soros) ఫౌండేషన్ సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన ఆరోపణలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) సోమవారం స్పందించారు. ఇలాంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. దేశ రాజధానిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దాని కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. "దేశం ముందున్న కొన్ని సమస్యలను రాజకీయ దృక్కోణంతో చూడకూడదని నేను భావిస్తున్నాను. జార్జ్ సోరోస్ .. వెలుగులోకి వచ్చిన అతని లింకులు - మేము దీనిని కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి సంబంధించిన సమస్యగా చూడము. ఇది భారత వ్యతిరేక శక్తులకు సంబంధించినదిగా గుర్తించాలని అన్నారు.కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పై బిజెపి చేసిన ఆరోపణలు పె...