
Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు ...