దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులకు ప్రాపర్టీ ఆస్తి కార్డులు జారీ చేయనున్నారు. ప్రధానమంత్రి యాజమాన్య పథకం (prime Minister Ownership plan) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘స్వామిత్వ పథకం’ ఎప్పుడు ప్రారంభించారు?
ఈ పథకాన్ని ఏప్రిల్ 24, 2020 (జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం నాడు) ప్రధాని మోదీ ప్రారంభించారు. డ్రోన్ సర్వే, GIS సాంకేతికతను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి యజమానులకు “రికార్డ్ ఆఫ్ రైట్స్” అందించడమే ఈ పథకం లక్ష్యం. COVID-19 మహమ్మారి సందర్భంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రధాన మంత్రి 2020 అక్టోబర్ 11న మొదటి సెట్ ప్రాపర్టీ కార్డ్‌లను పంపిణీ చేశారు.
prime Minister’s Ownership Scheme : ప్రధానమంత్రి యాజమాన్య పథకం అంటే ఏమిటి?
ఓనర్ షిప్ స్కీమ్ (Ownership Scheme) కింద గ్రామీణ ప్రాంతాల్లోని భూ రికార్డులను డిజిటల్ విధానంలో రూపొందిస్తారు. ఇందులో భూమిని సొంతం చేసుకునే హక్కు ప్రజలకు కల్పించడం ద్వారా భూ వివాదాలకు చెక్ పడుతుంది. మరోవైపు భూమి యాజమాన్య హక్కులను కల్పించడం వల్ల రైతులు రుణాలు పొందడం కూడా సులువుగా మారుతుంది. ఈ పథకంలో భాగంగా డ్రోన్ సర్వే , GIS ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాజమాన్య హక్కులను నిర్ధారిస్తారు.
ప్రయోజనాలు ఇవే..
భూమి యాజమాన్యానికి స్పష్టమైన ఆధారాలను ఈ పథకం ద్వారా అందుతుంది. దీంతో భూ వివాదాలు తగ్గుతాయి. భూమిపై యజమాని వివరాలు స్పష్టం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతమవుతాయి. రైతులకు రుణాలు కూడా సులభంగా పొందవచ్చు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు. ప్రధాన మంత్రి స్వామ్‌వాత్ యోజన కింద ఇప్పటివరకు 3.17 లక్షలకు పైగా గ్రామాలలో డ్రోన్ సర్వే (Drone survey) పూర్తిచేశారు. 92 శాతం గ్రామాలను ఇప్పటివరకు సర్వే చేశారు. అదే సమయంలో 1.53 లక్షల గ్రామాలకు సంబంధించి దాదాపు 2.25 కోట్ల ఆస్తి కార్డులను రూపొందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.