Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Article 370  | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Article 370 | జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.

కాగా ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌ సమానమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశమూ కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయానికి అనుకూలంగానే తీర్పు వెలువరించింది.

READ MORE  లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి

ఎన్నికలు ఎప్పుడంటే.?

జమ్ముకశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సైతం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుతం, జమ్మూకశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024, సెప్టెంబరు 30లోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

జరిగింది ఇదీ..

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న పూర్తిగా రద్దు చేసింది.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలితప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కశ్మీర్ కు చెందిన పలు పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వీటన్నింటిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ సంవత్సరం ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారించింది. సెప్టెంబరు 5న తీర్పును రిజర్వ్ చేసి తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది. కాగా కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. గత రెండు వారాలుగా కశ్మీర్ లోయలో గల 10 జిల్లాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకొనగా, మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

READ MORE  TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *