Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Spread the love

Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది.

Highlights

ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును ప‌వ‌న్ కుమార్‌ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను గుర్తించింది. అనంతరం వారణాసిలోని ఏటీఎస్‌ ఫీల్డ్‌ యూనిట్‌ అతడిని విచారణ నిమిత్తం తీసుకొచ్చింది.

విచారణలో భార‌తీయ రైళ్లలో గేట్లు మరియు కిటికీల దగ్గర కూర్చున్న ప్రయాణీకుల నుంచి మొబైల్ ఫోన్‌లను లాక్కోవడానికి, రైళ్ల‌ వేగాన్ని తగ్గించడానికి రైలుపై రాళ్లు రువ్వడం (Stone-Pelting on Trains) వంటి త‌మ‌ ముఠా చేస్తుంద‌ని హుస్సేన్ వెల్లడించాడు.అత‌డిని క్షుణ్ణంగా విచారించిన తర్వాత, తదుపరి చర్యల కోసం హుస్సేన్‌ను వ్యాస్‌నగర్, చందౌలీలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి అప్పగించారు. ప్రస్తుతం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్పీఎఫ్ చర్యలు తీసుకుంటోంది. రైళ్లలో ప్రయాణీకుల భద్రతకు భంగం కలిగించే ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ATS పర్యవేక్షణ చర్యలను కొనసాగిస్తుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *