Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు..  AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది.

ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను విశ్లేషించడం, వాయిస్‌లను గుర్తించడం, నేరస్థుల ముఖాలను ప‌సిగ‌ట్ట‌డం పనులను చేసిపెడుతుంది. ఈ క్రైమ్ జీపీటీ సాయంతో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు ఇప్పటివరకు   ప్ర‌స్తుతం 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ సిద్ధం చేసుకున్నారు.  ఈ ట్రైమ్ జీపీటిని రూపొందించిన స్టాక్ టెక్నాలజీస్ CEO సహ వ్యవస్థాపకుడు, అచువల్ రాయ్, UP పోలీసులు, Staq మధ్య సహకారం గురించి వివ‌రించారు.

READ MORE  వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి

Staqu అధునాతన సాంకేతికత (Artifical intelligence) ద్వారా ప‌నిచేస్తూ పోలీసు వ్య‌వ‌స్థ‌ల‌కు మెరుగైన సేవ‌లందిస్తుంద‌ని తెలిపారు. డిజిటైజ్ చేయబడిన క్రిమినల్ డేటాబేస్‌తో ఇంటర్‌ఫేస్ చేయడం ద్వారా, క్రైమ్ GPT,  రాతపూర్వక,  ఆడియో ఇన్‌పుట్‌లను ఉపయోగించి, అనుమానాస్పద, నిందితులైవారిపై  ఖచ్చితమైన వివరాలను విశ్లేషించడంలో ఈ  కొత్త టూల్ ఉపయోగపడుతుందని తెలిపారు.  క్రైమ్ GPT టూల్  అభివ`ద్ధి చేయడానికి ముందు  త్రినేత్ర  టూల్ ను   ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ  ఉపయోగించింది. ఇది విజయం సాధించి పోలీసులకు ఉత్తమ ఫలితాలను అందించింది.  నివేదిక ప్రకారం త్రినేత్ర నేరస్థుల ముఖాలను కూడా గుర్తిస్తుంది. శాంతిభద్రతలను మెరుగుపరచడంలో  లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి సహాయం చేసినందుకు త్రినేత్రను ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రశాంత్ కుమార్  అభినందించారు.

READ MORE  Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

  1. Great తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *