SCR Special Trains | కార్తీక మాసం పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ దిశగా ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి–దానాపూర్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్–నిజాముద్దీన్ స్పెషల్ రైలు (07081 / 07082)
- సికింద్రాబాద్–నిజాముద్దీన్ (07081): అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో నడుస్తుంది.
- నిజాముద్దీన్–సికింద్రాబాద్ (07082): అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో తిరుగు ప్రయాణం.
హాల్టింగ్ స్టేషన్లు:
మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, అకోలా, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, మథుర మొదలైనవి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
చర్లపల్లి–దానాపూర్ స్పెషల్ రైళ్లు (07091 / 07092 / 07049 / 07050)
- చర్లపల్లి–దానాపూర్ (07091): అక్టోబర్ 23, 28 తేదీల్లో ఉదయం 9.30కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45కి చేరుతుంది.
- దానాపూర్–చర్లపల్లి (07092): అక్టోబర్ 24, 29 తేదీల్లో రాత్రి 9.15కి బయలుదేరి, రెండో రోజు ఉదయం 7.30కి చేరుతుంది.
- చర్లపల్లి–దానాపూర్ (07049): అక్టోబర్ 26న బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 7.45కి చేరుతుంది.
- దానాపూర్–చర్లపల్లి (07050): అక్టోబర్ 27న రాత్రి 9.15కి బయలుదేరి, రెండో రోజు ఉదయం 7.30కి చేరుతుంది.
ఆగే స్టేషన్లు: కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్ని, సాట్నా, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆర.
ఈ ప్రత్యేక రైళ్లు పండుగ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుని సౌకర్యవంతంగా ప్రయాణించాలని వారు సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


