South Central Railway | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పలు రైళ్ల పొడిగింపు
South Central Railway | హైదరాబాద్ : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.సెలవుల నేపథ్యంలో రైళ్ల న్నీ ప్రయాణికులో కిటకిటలాడుతున్నాయి. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అనేక అగచాట్లు పడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల కోసం ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో రెండు నెలల పాటు పొడిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా నడిచే 8 రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. .
రైళ్ల వివరాలు ఇవీ..
- ప్రతి బుధవారం నడుస్తున్నతున్న మధురై- కాచిగూడ(07192), జాల్నా-ఛాప్రా(07651) రైళ్లను జూన్ 26వరకు ప్రయాణించనుంది.
- ప్రతి సోమవారం నడుస్తున్న కాచిగూడ- మధురై (07191) రైలును జూన్ 24 వరకు పొడిగించారు.
- ప్రతి శుక్రవారం నడుస్తుతున్న కాచిగూడ- నాగర్‌సోల్(07435), హెచ్‌ఎ్‌స నాందేడ్- ఈరోడ్(07189), ఛాప్రా-జాల్నా(07652) రైళ్లను జూన్ 28 వరకు పొడిగించారు.
- ప్రతి ఆదివారం నడుస్తుతున్న నాగర్‌సోల్- కాచిగూడ(07436), ఈరోడ్- నాందేడ్(07190) రైళ్లను జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.
Extension of Special Trains#SCR #Specials pic.twitter.com/rznDU1289g
— South Central Railway (@SCRailwayIndia) April 3, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..