South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 12 రైల్వేస్టేషన్లలో తక్కువ ధరలో ఎకానమీ మీల్స్..
South Central Railway Economy Meals | రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్నిఅందించేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై సాధారణ కోచ్‌ల వద్ద అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి “ఎకానమీ మీల్స్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి తక్కువ ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తోంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి.
కొత్తగా చేర్చిన స్టేషన్లు ఇవే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా 12 స్టేషన్లలో ఎకానమీ మీల్స్ అందించడం ప్రారంభించింది. ఆయా స్టేషన్లలో ప్రయాణీకులకు ఈ భోజనాన్ని అందించడానికి 23 కౌంటర్లను ఏర్పాటు చేసింది. అవి హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ఎకానమీ మీల్స్ అంటే ఏమిటి?
Railway Economy Meals : ధర రూ. 20/- మాత్రమే. ఈ భోజనాలు రైలులో ప్రయాణిస్తున్నవారికి సంతృప్తికరమైన సరసమైన ధరలకు లభిస్తాయి.
స్నాక్ మీల్స్: తేలికపాటి ఆహారం కోరుకునే వారికి రూ. 50/- అల్పాహారం కూడా అందుబాటులో ఉంటుంది
రైలు ప్రయాణికులు సులభంగా కొనుగోలు చేసుకునేందుకు ప్లాట్‌ఫారమ్‌లలో జనరల్ సెకండ్ క్లాస్ (GS) కోచ్‌ల దగ్గర సౌకర్యవంతంగా ఉండే కౌంటర్లలో ఈ భోజనం, నీరు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులు నేరుగా ఈ కౌంటర్ల నుంచి వారి రిఫ్రెష్‌మెంట్‌లను కొనుగోలు చేయవచ్చు, విక్రేతల కోసం వెతకడం లేదా స్టేషన్ బయటివైపునకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
అంతకుముందు, ఈ సేవ గత సంవత్సరం భారతీయ రైల్వేలో దాదాపు 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా వీటికి అపూర్వ స్పందన వచ్చింది. ఆ విజయాన్ని పురస్కరించుకుని రైల్వేలు ఈ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 100కి పైగా రైల్వే స్టేషన్లలో కౌంటర్లు పనిచేస్తున్నాయి. ఈ స్టేషన్లలో మొత్తం దాదాపు 150 కౌంటర్లు ఉన్నాయి. ఈ చొరవ సమీప భవిష్యత్తులో మరిన్ని స్టేషన్‌లను విస్తరించనుంది.
ఎకానమీ భోజన సదుపాయం ప్రధానంగా సాధారణ ప్రయాణికులకు ఉపయోగపడుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. SCR పరిధిలో ఇవి ఏడు స్టేషన్లలో అందించబడుతోంది. స్టేషన్లలో పని చేస్తున్న IRCTC కిచెన్ యూనిట్ల నుండి ఎకానమీ భోజనం అందుతుంది అని తెలిపారు.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..