Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ సమావేశంలో ఒక మౌలానా ఈ అసాధారణ తీర్పును ప్రకటించారు. బాధితురాలి తరఫు ఓ మహిళ నిందితుడికి ఐదు చెంపదెబ్బలు కొట్టగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అయితే దీనికి సంబంధించిన‌ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ప్రకారం.. బాధితురాలి కుటుంబం మొదట మైనర్ బాలిక అదృశ్యమైన‌ట్లు చెప్పారు. ఇందులో పొరుగున ఉన్న అబ్బాయి ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

READ MORE  సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం.. అత్యంత‌ కఠినమైన 'లవ్ జిహాద్' బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..

ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తన ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక యువకుడే ఆమెను అపహరించినట్లు వారు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాలిక కోసం గాలింపు ప్రారంభించారు. తదనంతరం, కుటుంబ సభ్యులు.. సంఘం సభ్యులు బాలికను వెతికేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఫిర్యాదును కూడా వెన‌క్కి తీసుకున్నారు.

పంచాయితీలో మౌలానా తీర్పు

చివరకు బాలిక ఆచూకీ లభించడంతో స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో పంచాయితీ పెట్టారు. ఒక మౌలానా సమావేశానికి అధ్యక్షత వహించి, నిందితులు.. బాధిత కుటుంబ సభ్యుల వాదనలను విన్నారు. పంచాయితీ సందర్భంగా నిందితులు తనను రప్పించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.
ఇరువైపులా వాద‌న‌లు విన్న తర్వాత మౌలానా తన తీర్పును వెలువరించారు. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి చెందిన ఓ మహిళ పంచాయతీలోనే చెప్పుతో కొట్టింది. చెంపదెబ్బ కొట్టిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అధికారికంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తెలిపారు.

READ MORE  రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *