Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు

Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు  వందేభారత్ స్లీపర్ రైలు

Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో  పెట్టుకొని త్వరలోనే వందేభారత్  స్లీపర్ రైళ్లను తీసురావాలని భారతీయ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే..  ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తుండగా సరికొత్త స్లీపర్ వెర్షన్ ను సికింద్రాబాద్ – పూణే (Secunderabad-Pune Vande Bharat) మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రయాణాలను అనుగుణంగా రాత్రివేళ ప్రయాణించేవారి కోసం తీసుకొస్తున్నారు. ఈ కొత్త రైళ్లు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలోని స్లీపర్ క్లాస్ రైళ్ల భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇవి అధునాతన భద్రతా వ్యవస్థలు, ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సౌకర్యాలతో ఇబ్బంది లేని ప్రయాణ అనుభూతిని కలిగి ఉంటాయి.

READ MORE  పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ఉత్పత్తి యూనిట్ అయిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) నిర్మిస్తున్నాయి. కాగా వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన భద్రతా పరీక్షలు చివరి దశల్లో ఉన్నాయి.

Also Read | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

ఈ స్లీపర్ రైళ్లు ప్రతి కోచ్‌లో ఇంటర్-కమ్యూనికేటివ్ ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సౌండ్‌ఫ్రూఫింగ్, సెన్సార్ ఆధారిత లైటింగ్, చిన్న ప్యాంట్రీలతో సహా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటాయి. అదనంగా, వారు  సౌకర్యవంతంగా  బంక్ బెడ్‌లు, వికలాంగులకు అనుకూలమైన బెర్త్‌లు, దుర్వాసన లేని యాంటీ-స్పిల్ వాష్‌బేసిన్‌లతో కూడిన విశ్రాంతి గదులను ఇందులో చూడవచ్చు.  వందే భారత్ సెమీ-హై-స్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా విస్తరించడానికి, ప్రయాణికులకు సేలందించేందుకు సిద్ధమవుతున్నాయి.

READ MORE  PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

గంట వరకు తగ్గనున్న ప్రయాణ సమయం

సికింద్రాబాద్ -పుణే వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ ఎంపికగా నిలవనుంది.  సికింద్రాబాద్-పుణె వందే భారత్ స్లీపర్ అదే మార్గంలో ఉన్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను భర్తీ చేయనుంది.  ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 8 గంటల 25 నిమిషాలు పడుతుంది. వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే..  ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు కనీసం గంట ముందుగా చేరుకుంటారు. కొత్త సర్వీస్‌కు సంబంధించి ఖచ్చితమైన షెడ్యూల్, స్టాప్‌లు ఇంకా ఖరారు కాలేదని అధికారులు తెలిపారు

కాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం ఐదు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లు 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

  • సికింద్రాబాద్ – విశాఖపట్నం
  • సికింద్రాబాద్ – తిరుపతి
  • తిరుపతి – సికింద్రాబాద్
  • కాచిగూడ – యశ్వంతపూర్ (హైదరాబాద్ – బెంగళూరు)
  • విజయవాడ – MGR చెన్నై సెంట్రల్
READ MORE  Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *