SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించనున్నట్లు ప్రకటించింది.
- సోమవారం, బుధవారాల్లో నడిచే పట్నా- సికింద్రాబాద్ ( రైలు నెంబర్ 03253 ) ఆగస్టు 05 నుంచి 30 వరకు,అలాగే ప్రతి బుధవారం నడిచే హైదరాబాద్ – పట్నా(రైలు నెంబర్ 07255 ) ఆగస్టు 07 నుంచి అక్టోబర్ 2 వరకు నడిపించనున్నారు.
- ప్రతి శుక్రవారం నడుస్తున్న రైలు నెంబర్ 07256 సికింద్రాబాద్ -పట్నా ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 08 నుంచి సెప్టెంబర్ 27వరకు పొడిగించనున్నారు.
- దానాపూర్ నుంచి సికింద్రాబాద్ ( 03225 రైలు నెంబరు ) వరకు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు నడిపించనున్నారు. ఈ రైలు ప్రతీ గురువారం నడుస్తోంది.
- ప్రతీ ఆదివారం నడిచే సికింద్రాబాద్ – దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం 03226) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించనున్నారు.
- SCR Special Trains ప్రతి గురువారం నడిచే రైలు నెంబర్ 09419 అహ్మదాబాద్-తిరుచురాపల్లి ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైలు జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించారు.
- ప్రతీ ఆదివారం నడిచే తిరుచురాపల్లి- అహ్మదాబాద్ (రైలు నెంబర్ 09420) జూలై 28 నుంచి ఆగస్టు 18 వరకు నడిపించనున్నారు.
- ప్రతి ఆదివారం నడిచే కొయంబత్తూర్ నుంచి దానాపూర్ (రైలు నెంబర్ 06185) ప్రత్యేక రైలు
జూలై 21 న ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. - బరౌని నుంచి కొచువెలి మధ్య నడిచే ప్రత్యేక రైలు (ట్రెయిన్ నెం 06092) జూలై 23న మంగళవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.