Posted in

Sambhal Violence | సంభాల్‌ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు

Sambhal Violence
Sambhal Violence
Spread the love

Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మ‌సీదును స‌ర్వే చేయ‌డానికి వ‌చ్చిన అధికారుల‌ సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు లాఠీచార్జికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు.

Highlights

సంభాల్‌లోని షాహీ జామా మసీదుకు సంబంధించి వివాదం నెలకొంది. ఇక్కడ హిందూ పక్షం ఇది జామా మసీదు కాదని, హరిహర‌ దేవాలయమని వాదిస్తోంది. దీనిపై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా, విచారణకు ఆదేశించింది. ఈరోజు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ఇక్కడ సర్వే నిర్వహించాల్సి ఉంది. అడ్వకేట్ కమీషనర్ సర్వే కోసం వచ్చారు, అయితే ఇంతలో పెద్ద సంఖ్యలో దుండ‌గులు అక్కడ గుమిగూడి రాళ్ల దాడి ప్రారంభించారు.

షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా గుమిగూడిన దుండ‌గులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ విడుదల చేసి ఆందోళ‌న‌కారుల‌ను తరిమికొట్టారు. ఈ సంఘ‌ట సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, SP సహా అనేక పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు బలగాలు సంఘటనా స్థలంలోకి త‌ర‌లించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎస్పీ ఎంపీ తండ్రిపై నిషేధం

అంతకుముందు, సంభాల్ ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ తండ్రి మమ్లుకూర్ రెహ్మాన్ సహా 34 మందిపై నిషేధం విధించినట్లు సంభాల్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) వందనా మిశ్రా తెలిపారు. వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించవచ్చని, ప్రజా సామరస్యానికి భంగం కలిగించవచ్చని లేదా ఏదైనా తప్పుకు పాల్పడవచ్చని సమాచారం అందితే, స్థానిక అధికార యంత్రంగం స‌ద‌రు వ్యక్తిపై ఆంక్ష‌లు విధించ‌వ‌చ్చు.

నిజానికి, షాహీ జామా మసీదులోని హరిహర‌ దేవాలయం అనే పిటిష‌న్ ను మంగళవారం సమర్పించారు. ఆ తర్వాత కోర్టు సర్వేకు ఆదేశించింది. అప్పటి నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జామా మసీదుకు వెళ్లే మూడు మార్గాలను మూసివేశారు. PAC, RRF సిబ్బందిని మోహరించారు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

 

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *