
సంభాల్‌లో జామా మసీదు ఎక్కడ ఉంది?
Sambhal News | ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రం మధ్యలో మొహల్లా కోట్ పూర్విలో షాహీ జామా మసీదు ఉంది. ఈ భవనం 1920లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రింద రక్షిత ప్రదేశంగా ప్రకటించింది. ఆ తర్వాత ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనంగా కూడా పరిగణించారు. సంభాల్‌లోని జామా మసీదు (Sambhal Jama Masjid) ప్రధాన ద్వారం ముందు ఎక్కువ మంది హిందూ జనాభా నివసిస్తుండగా, ప్రహరీ వెనుక ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు.
సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?
1526 నుంచి 1530 మధ్య బాబర్ ఐదు సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదులలో సంభాల్ జామా మసీదు ఒకటి. మిగిలిన రెండు మసీదుల్లో ఒకటి పానిపట్ మసీదు కాగా, మరొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు. సంభాల్ నగరంలో ప్రస్తుతం ముస్లిం ఎక్కువగా ఉంది. కానీ హిందూ గ్రంథాలలో ఈ నగరానికి ప్రత్యేక ప్రస్తావన ఉంది. కలియుగ సమయంలో, కల్కి అనే విష్ణువు అవతారం ఇక్కడ ఉంటుందని చెబుతారు. కలి యుగాన్ని అంతం చేసి కొత్త శకాన్ని ప్రారంభిస్తాడు. సంభాల్‌లో జామా మసీదు ను గతంలో ఆలయాన్ని కూల్చి వేసి నిర్మించినట్లు హిందూ పక్షం వాదిస్తోంది.1527-28లో, బాబర్ జనరల్ శ్రీ హరిహర్ ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేశాడు. “1527-28లో హిందూ బేగ్, బాబర్ ఆర్మీ లెఫ్టినెంట్ సంభాల్‌లోని హరిహర ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేసాడు” “ముస్లింలు ఆలయ భవనాన్ని మసీదుగా ఉపయోగించేందుకు ఆక్రమించుకున్నారు” అని పిటిషన్లరు పేర్కొన్నారు.