Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?
Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) నగరలో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా అ తర్వాత బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు.
అతను థానేలోని రికీస్ బార్‌లో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నాడని. తనను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి తన పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బాంద్రా వెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అతని మెడ, భుజంపై సహా ఆరుసార్లు కత్తితో పొడిచాడు. అతడిని చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించగా, ఐదు గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం అతని వెన్నెముక నుండి 2.5 అంగుళాల కత్తిని తొలగించారు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడు ఏ ఉద్దేశంతో ప్రవేశించారు?
సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan పై కత్తితో దాడి జరిగిన తర్వాత నిందితులు ఇంట్లోకి ప్రవేశించడానికి గల ఉద్దేశ్యం ఏమిటో గుర్తించలేదు. అతడు దొంగతనానికి వెళ్లాడా లేక ఎవరైనా హత్య చేసేందుకు వెళ్లాడా అనే విశ్వసనీయ సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని, అతను దొంగిలించబోయే ఇల్లు బాలీవుడ్ నటుడిదని అతడికి తెలియదని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.