Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల  పుణ్యక్షేత్రానికి (Sabarimala) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్‌ -కొట్టాయం, నర్సాపుర్-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Sabarimala ప్రత్యేక రైళ్ల వివరాలు

సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ (07129,07130) ప్రత్యేక రైళ్లు – నవంబరు 26, డిసెంబరు 3న, తిరుగుప్రయాణం – నవంబరు 28, డిసెంబర్ 5న ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిసూర్‌, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంటుంది.

READ MORE  Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ – కొల్లం- సికింద్రాబాద్‌ (07127,07128) ప్రత్యేక రైలు:

నవంబరు 24, డిసెంబరు 1న, తిరుగు ప్రయాణం-నవంబరు 25, డిసెంబర్ 2న. ఈ రైలు కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, శ్రీరామ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ,డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయి.

READ MORE  TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

కాకినాడ టౌన్‌ -కొట్టాయం-కాకినాడ టౌన్ (07126, 07126) ప్రత్యేక రైలు:

నవంబరు 23, 30న ఉంటాయి. తిరుగు ప్రయాణం : నవంబర్ 25, డిసెంబర్ 2. ఈ ప్రత్యేక రైళ్లు సామార్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలర్‌పెట్, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, అలువా, ఎర్నాకుళం టౌన్‌ స్టేషన్లలో నిలవనున్నాయి.

నర్సాపూర్-కొట్టాయం-నర్సాపూర్ (07119,07120) :

నవంబరు 26, డిసెంబరు 3. తిరుగు ప్రయాణం: నవంబర్ 27, డిసెంబరు 4. ఈ ట్రైన్ భీమవరం జంక్షన్, భీమవరం టౌన్‌, ఆకివీడు స్టేషన్ , కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌ రైల్వేస్టేషన్లలో ఆగనుంది.

READ MORE  Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..

కాచిగూడ-కొల్లం-కాచిగూడ (07123,07124) రైలు:

నవంబరు 22, 29, డిసెంబరు 6. తిరుగుప్రయాణం : నవంబరు 24, డిసెంబరు 1, 8న. ఈ రైళ్లు మల్కాజ్‌గి రి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆల్వాయ్‌, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనాచెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *