RSS foundation day | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం .. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit shah on RSS foundation day | కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం (RSS foundation day) సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతలో దేశభక్తి ఆలోచనలను పెంపొందించడంలో విశేషమైన కృసి చేస్తోందని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని 1925లో విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ వాలంటీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ క్రమశిక్షణ, దేశభక్తికి అద్వితీయ చిహ్నం. @RSSorg, ప్రారంభం నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతను సంఘటితం చేయడంలో అహర్నిశలు పాటుపడుతోందని తెలిపారు. ఈమేరకు అమిత్ షా ‘Xసలో పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ (Rashtriya Swayamsevak Sangh) సామాజిక సేవా కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా దేశ సంక్షేమానికి అంకితమైన దేశభక్తులను సృష్టించడం ద్వారా ప్రతి వర్గానికి సాధికారత కల్పిస్తోందని ఆయన అన్నారు. విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
‘అధర్మం’పై ‘ధర్మం’, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఈ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరూ తమలోని చెడులను తొలగించి, ‘ధర్మం’ మానవత్వ మర్గంలో పయనించేలా చేస్తోదంని తెలిపారు. శ్రీరాముడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తాడు. జై శ్రీరామ్” అని హిందీలో సందేశంలో పేర్కొన్నారు.
బిజెపి నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనమని, ఎమర్జెన్సీ సమయంలో ఆమె ధైర్యం, పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. రాజమాత సింధియాజీకి దేశం పట్ల ఉన్న విధేయత, ప్రజా సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని ఆయన అన్నారు. గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన సింధియా 1919 అక్టోబర్ 12న జన్మించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..