Friday, April 18Welcome to Vandebhaarath

ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పుల కలకలం

Spread the love

ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా ముగ్గురి మృతి

ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో.. ఆర్పీఫ్ ఏఎస్ఐ సహా మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ దారుణ సంఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాపి నుండి బోరివలి – మీరా రోడ్ స్టేషన్ మధ్య జరిగింది. నిందితుడు కానిస్టేబుల్‌ను ముంబై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12956)లోని బీ5 కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ చేతన్ కుమార్ కాల్పులు జరిపిన తర్వాత దహిసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి దూకాడు. అయితే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దర్యాప్తు జరుగుతోందని పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. “ASI [అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్] టికా రామ్ తోపాటు ముగ్గురు ప్రయాణీకులు మరణించారని, కానిస్టేబుల్ చేతన్ కుమార్ దహిసర్ దగ్గర దిగి, అలారం చైన్ లాగి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతడిని అరెస్టు చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

READ MORE  RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *