Saturday, August 30Thank you for visiting

Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

Spread the love

Rozgar Mela 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌మెంట్లకు సుమారు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌(Appointment Letters)లను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది.
రిక్రూట్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలో జరుగుతోంది. కొత్త రిక్రూట్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు.

“రోజ్‌గార్ మేళా(Rozgar Mela 2023) అనేది.. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి ఆలోచనకు అనుగుణంగా వేసిన ఒక అడుగు. రోజ్‌గార్ మేళా.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అవకాశాలను అందిస్తుందని ”అని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రటించిదంి.
కొత్తగా నియమితులైన వారు iGOT కర్మయోగి పోర్టల్‌ (iGOT Karmayogi portal)లో ఆన్‌లైన్ మాడ్యూల్ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని పొందవచ్చు. ఇక్కడ 680 కంటే ఎక్కువ ఇ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు ప్రధాని మోదీ గతేడాది అక్టోబర్ 22న ‘రోజ్‌గార్ మేళా’ను ప్రారంభించారు.

 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *