Wednesday, April 16Welcome to Vandebhaarath

Cricket | బంగ్లాదేశ్ టెస్ట్ లో ఇరగదీసిన అశ్విన్.. మెరపు సెంచరీతో ఎంఎస్ ధోని టెస్టు రికార్డు సమం

Spread the love

Cricket | చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మెరుపు ఇన్నింగ్ తో సత్తా చాటాడు. క‌ష్ట‌కాలంలో కీలకమైన సెంచరీని సాధించడం ద్వారా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆల్-రౌండర్ తన ఆరో టెస్ట్ సెంచరీని అందించి దిగ్గజ క్రికెటర్లు MS ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల టెస్ట్ రికార్డును సమం చేశాడు. .

38 ఏళ్ల అశ్విన్ MA చిదంబరం స్టేడియంలో మొదటి రోజు ప్రారంభంలో టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలిపోయింది. ఆ త‌ర్వాత‌ భారత్‌ను రక్షించడానికి వ‌చ్చిన అశ్విన్, రవీంద్ర జడేజా ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

READ MORE  New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

చెన్నైలో తన రెండో టెస్టు సెంచరీ నమోదు చేయడంతో 100 పరుగుల మార్కును అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే చేరుకున్నాడు. ధోనీ, పటౌడీల టెస్ట్ సెంచరీలను సమం చేసి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ధోనీ తన 144 టెస్టు ఇన్నింగ్స్‌లో కేవలం 6 సెంచరీలు నమోదు చేయగా, అశ్విన్ కూడా తన ఆరు సెంచ‌రీల‌కు 144 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

ఇదిలా ఉండగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్, జడేజా నాటౌట్‌గా నిలవడంతో భారత్ 80 ఓవర్లలో 339/6 స్కోరును చేసింది. అశ్విన్ 112 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, జడేజా 117 బంతుల్లో 86* పరుగులు చేశాడు.

READ MORE  ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

MA చిదంబరం స్టేడియంలో ప్రారంభ సెషన్‌లో హసన్ మహ్మద్ మూడు తీశాడు. కీల‌క బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెవిలియ‌న్ కు చేర్చాడు. ఇక భారత్‌ మిడిల్‌ ఆర్డర్ కూడా ఆకట్టుకోలేకపోయింది. కాగా  చెపాక్ స్టేడియంలో అశ్విన్ బ్యాటింగ్ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 48 సగటుతో దాదాపు 300 పరుగులు చేశాడు. ఈ మైదానంలో  ఒక సెంచరీ ఇంగ్లండ్‌పై చేశాడు.

READ MORE  IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *