Friday, January 30"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?

Spread the love

Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. దేశంలోని అత్యంత గౌరవనీయమైన ది వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా తన చేపట్టిన అనేక దాత్రుత్వ కార్యక్రమాలతో ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన మరణం తర్వాత‌ ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది.

Highlights

రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ. వీరు 1940లో విడాకులు తీసుకున్నారు. దీంతో నావల్ టాటా 1955లో స్వీస్ మహిళ సిమోన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. నోయెల్ టాటాకు మాయ టాటా, నెవిల్లే టాటా, లియా టాటా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం టాటా గ్రూపు వ్యాపారాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. వీరిలో రతన్ టాటా వారసులుగా ఎవరు ఉండబోతున్నారనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

39 ఏళ్ల లియో టాటా .. స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుంచి మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. 2006లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లో పనిచేశారు. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
34 ఏళ్ల మాయ టాటా.. ఆమె ప్రస్తుతం టాటా ఫైనాన్షియల్ సంస్థలో విశ్లేషకురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్ లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

నెవిల్లే టాటా వ‌య‌స్సు 36. రతన్ టాటా సామ్రాజ్యానికి ఈయ‌న‌ను కూడా వారసుడిని భావిస్తున్నారు. అతను టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నాడు. జంషెడ్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. ట్రెంట్ లిమిటెండ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నాడు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *