Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మానవతావాదిగా కీర్తిప్రతిష్టలు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ పట్టా స్వీకరించారు.
రతన్ టాటా నాయకత్వం
రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయన నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీ ని కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
టాటా మైలు రాళ్లు ఇవే..
2000: బ్రిటీష్ టీ బ్రాండ్ అయిన టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చారు.
2004: TCS ఐపీవో ద్వారా రతన్ టాటా చరిత్ర సృష్టించారు.
2005: టాటా కెమికల్స్ బ్రిటిష్ కంపెనీ బ్రన్నర్ మోండ్‌ని కొనుగోలు చేసింది
2007: యూరోపియన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేశారు.
2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేశారు.
2008: భారతదేశంలో అత్యంత సరసమైన కారు టాటా నానోను విడుదల చేసింది
2008: భారత్ లోని రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ రతన్ టాటాకు ప్రదానం చేశారు.
2012: టాటా గ్రూప్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం తర్వాత రతన్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు, సైరస్ మిస్త్రీకి బాధ్యతలు అందించారు. టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
2016: సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు
2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి వరకు టాటా గ్రూపునకు తాత్కాలిక చైర్మన్‌గా పని చేశారు.
2018: టీసీఎస్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ టాటా చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించారు.
2017 నుంచి 30కు పైగదా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.
భారత ప్రభుత్వం రతన్ టాటాను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆయన తన దానధర్మాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. తన ఆస్తిలో సుమారు 60 శాతం దానధర్మాలకే కేటాయించారు. రతన్ టాటా చరిత్ర గురించి చెప్పాలంటే ఒక మహా గ్రంథం అయినా సరిపోదు. ఈ దేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక రతన్ టాటా ఉంటారు. దేశ సరిహద్దుల్లో జవాన్ నుంచి పొలాల్లో రైతుల వరకు టాటా తన వ్యాపారం ద్వారా సేవలందించింది.
టాటా స్కాలర్‌షిప్ ఫండ్
రతన్ టాటా దాతృత్వానికి సాటి లేదు. ఆయన మార్గదర్శకత్వంలో, టాటా గ్రూప్ భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో $28 మిలియన్ల టాటా స్కాలర్‌షిప్ ఫండ్‌ను సృష్టించింది. 2010లో, టాటా గ్రూప్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సౌకర్యాన్ని సృష్టించేందుకు $50 మిలియన్లను అందించింది. అక్కడ రతన్ టాటా.. తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తిచేశారు. 2014లో టాటా గ్రూప్ IIT-బాంబేకి ₹95 కోట్లు ఇచ్చింది, తక్కువ జనాభా కోసం డిజైన్, ఇంజనీరింగ్ భావనలను రూపొందించడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ (TCTD)ని స్థాపించింది.
టిసీఎస్ (TCS)
రతన్ టాటా స్థాపించిన టిసిఎస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ సర్వీసుల సంస్థగా ఎదిగింది. సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు టాటా గ్రూపు సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంతకు 10 రెట్ల మంది పరోక్షంగా టాటా సంస్థల నుంచి ఉపాధిని పొందుతున్నారు…రతన్ టాటాను ఆధునిక భారత జాతి నిర్మాతగా కీర్తించినా తక్కువే అవుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..