Posted in

తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

The Legend of Prince Rama
The Legend of Prince Rama
Spread the love

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ (The Legend of Prince Rama) అభిమానులు థియేటర్లలో చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, గీక్ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వాల్మీకి రామాయణం యానిమే మూవీ , ఆంగ్ల డబ్బింగ్‌తో పాటు కొత్త హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అక్టోబర్ 18 న భారతీయ థియేటర్లలోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR వంటి బ్లాక్‌బస్టర్‌లకు ప్రసిద్ధి చెందిన లెజెండరీ స్క్రీన్ రైటర్ V.విజయేంద్ర ప్రసాద్ తో ఈ డ‌బ్బింగ్ మూవీకి అద‌న‌పు బ‌లాన్నిస్తుంది. ఈ కొత్త ఐకానిక్ అనిమే చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జపాన్‌లోనే నిర్మించారు. రెండు ఇరు దేశాల నుంచి దాదాపు 450 మంది కళాకారులు ఈ చిత్ర రూప‌క‌ల్ప‌నలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలైన ఏడాది తర్వాత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మొదటిసారి ప్రదర్శించారు. అయితే అప్పట్లో రామజన్మభూమిపై వచ్చిన వివాదాల కారణంగా ఆ సినిమా థియేటర్లలో నిలదొక్కుకోలేక చివరకు ఇండియాలో టీవీల్లో ప్రసారమైంది. గత సంవత్సరం ఆదిపురుష్‌పై విమర్శలు వచ్చినప్పుడు, ప్రజలు జపనీస్-ఇండియన్ చిత్రం రామాయణాన్ని ఆదిపురుష్‌తో పోల్చారు యానిమే చిత్రాన్ని పొడత్త‌ల‌తో ముంచెత్తారు. ఇప్పుడు 31 సంవత్సరాల తర్వాత, ఈ చిత్రం భారతీయ థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది.

The Legend of Prince Rama విడుదల తేదీ

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమా చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు హామీ ఇస్తున్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని జపనీస్ అనిమే (Japanese anime) ప్ర‌తిభ‌తో అందంగా ముస్తామైంది. గీక్ పిక్చర్స్ ఇండియా, AA ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా భారతదేశం అంతటా డిస్ట్రిబ్యూట్ అయిన‌ ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం దాని ఒరిజినల్ ఇంగ్లీష్ డబ్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో కొత్తగా డబ్బింగ్ వెర్షన్‌లతో అక్టోబర్ 18న భారతదేశం అంతటా థియేటర్‌లలో విడుదల కానుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *