Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..

Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..

Rains | ఈ వేస‌విలో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి రెండో వారంలోనే తీవ్ర‌మైన ఎం ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.. ఈక్ర‌మంలోనే వాతావరణ శాఖ చల్లటి వార్త‌ చెప్పింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఎండ‌లు త‌గ్గిపోయి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది.

రాష్ట్రంలో వ‌చ్చే ఆది, సోమ, మంగళవారాల్లో మార్చి 17, 18, 19వ తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMDA) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగ మంచు వాతావరణం ఉండే చాన్స్‌ ఉందని వెల్లడించింది. గురువారం పలు జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవ‌డంతో ఉక్క‌పోత‌లు పెరిగిపోయాయి. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా.. 40.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక‌ హైదరాబాద్‌ లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైగా నమోదైంది.

READ MORE  TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *