Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివారణకు ఇకపై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు
Indian Railways | ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైలు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భద్రత (Railway Safety) కోసం ఇకపై బోర్డు అన్ని ఇంజన్లు, కీలక యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో విలేకరుల సమావేశంలో, రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈఓ జయ వర్మ సిన్హా వివరాలు వెల్లడించారు. అసాధారణ పరిస్థితులను గుర్తించేందుకు భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు ఈ AI- ఎనేబుల్డ్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. “మేము ప్రతి లోకోమోటివ్, అన్ని ముఖ్యమైన యార్డ్‌లలో AI టెక్నాలజీతో పనిచేసే CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నామనని ఆమె చెప్పారు.
రైల్వే ట్రాక్ భద్రతను ప్రస్తావిస్తూ కుంభమేళా సందర్భంగా సంఘవిద్రోహుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా భద్రతా సంస్థలు ట్రాక్‌లపై నిరంతర నిఘా నిర్వహిస్తాయని సిన్హా హామీ ఇచ్చారు. రాబోయే కుంభమేళా సన్నాహాలపై సమీక్షిస్తూ మౌలిక సదుపాయాలు, సామర్థ్య విస్తరణ ప్రాజెక్టులు ఈ ఉత్సవాలకు ముందే పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు ఆమె గుర్తుచేశారు. కుంభమేళా 2025 (Kumbh 2025 )లో జరిగే ప్రధాన పుణ్యస్నానాల దాదాపు 900 ప్రత్యేక రైళ్లు భారతీయ రైల్వే నడిపించనుంది.
అయితే ఈసారి కుంభమేళాకు 30 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో రద్దీని నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిన్హా చెప్పారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా ఎంపిక చేశామని, కుంభమేళాకు ముందు స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునికీకరిస్తామని తెలిపారు. రైల్వే బోర్డు చైర్‌పర్సన్ నార్త్ సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్‌లతో కుంభమేళా సన్నాహాలపై సమీక్షించారు. వివిధ స్టేషన్లలో ఆన్-సైట్ తనిఖీలు నిర్వహించారని ఒక అధికారి తెలిపారు.
రైలు ప్రమాదాలు
దేశంలో రైలు ప్రమాదాలు నిరంతరం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొనడం అధికారులు గమనార్హం. ఆధునికీకరణ, భద్రతా చర్య (Indian Railway Safety) కోసం బడ్జెట్ లో భారీ పెట్టుబడులు కేటాయిస్తున్పప్పటికీ పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో, భారతదేశం అనేక రైల్వే ప్రమాదాలను చవిచూసింది, దీని ఫలితంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇటీవల ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 19168)లో 20 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కాన్పూర్, భీమ్‌సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్‌లో కోచ్‌లు పట్టాలు తప్పడంతో తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..