Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టులకు నోటిఫికేషన్.. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
Railway Jobs | భారతీయ రైల్వేలో చేరాలనుకునే యువతకు ఇదే సువర్ణావకాశం.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఇటీవల భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. మొత్తం 11,558 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 3,445 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండి.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు
RRB NTPC Recruitment 2024: Vacancy Details
- జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 990 పోస్టులు
- అకౌంటెంట్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 361 పోస్టులు
- రైలు క్లర్క్: 72 పోస్టులు
- కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్: 2022 పోస్ట్‌లు
- గూడ్స్ రైలు మేనేజర్: 3144 పోస్టులు
- చీఫ్ కమర్షియల్ క్లర్క్: 732 పోస్టులు
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్: 1507 పోస్టులు
- స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు
RRB NTPC Recruitment 2024 : ముఖ్యమైన తేదీలు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి (లెవల్ 5, 6) పోస్టుల కోసం: సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13, 2024 వరకు
- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి (లెవల్ 2, 3) పోస్టుల కోసం: సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20, 2024 వరకు
వయో పరిమితి
- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు: 18 నుండి 33 సంవత్సరాలు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు: 18 నుండి 36 సంవత్సరాలు
- OBC లకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు
ముఖ్యమైన తేదీలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి (లెవల్ 5, 6) పోస్టుల కోసం: సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13, 2024 వరకు
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి (లెవల్ 2, 3) పోస్టుల కోసం: సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20, 2024 వరకు
పరీక్ష విధానం
Railway Jobs ఆన్‌లైన్ పరీక్ష: CBT 1 మరియు CBT 2
టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్
సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
ఎలా దరఖాస్తు చేయాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు: RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inలో సందర్శించండి.
- నోటిఫికేషన్ చదవండి: RRB NTPC 2024 అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
- రిజిస్ట్రేషన్: మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
- లాగిన్ చేయండి: రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ చేయండి.. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- పత్రాలను అప్‌లోడ్ చేయండి: నోటిఫికేషన్ లోపేర్కొన్న సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
- పేమెంట్ చేయండి: దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- దరఖాస్తును సబ్ మిట్ చేయండి : దరఖాస్తును సమర్పించే ముందు మొత్తం సమాచారం సరిగ్గా ఉందని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.. గడువులోపు దరఖాస్తు చేసుకోండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..