Tuesday, April 8Welcome to Vandebhaarath

Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..

Spread the love

Railway Jobs : రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు భార‌తీయ రైల్వే తీపిక‌బురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

పోస్టుల వివ‌రాలు

  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144
  • టికెట్ సూపర్ వైజర్ 1,736
  • టైపిస్ట్ 1,507
  • స్టేషన్ మాస్టర్ 994
  • సీనియర్ క్లర్క్ 732
READ MORE  రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి

ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 36 సంవ‌త్స‌రాల లోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు RRB చాన్స్ ఇచ్చింది.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. అయితే పరీక్షకు హాజరైన వారికి రూ.400 రీఫండ్ చేయ‌నున్నారు. పరీక్షలకు హాజరై ఉద్యోగానికి అర్హత పొందిన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు వేతనం ల‌భిస్తుంది. ఈ జాబ్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం కోసం RRB అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ను సంద‌ర్శించాలి.

READ MORE  RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం - వెంటనే అప్లయ్..!

ఇవే కాకుండా రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల (Railway Jobs) ను కూడా భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభమ‌వుతుంది. అక్టోబర్ 20 వరకు దరఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు గ‌డువు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *