Pune Porsche Crash | సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరగాలి. పుణె ప్రమాద బాధితుల తల్లిదండ్రుల డిమాండ్..
Pune Porsche Crash | జబల్పూర్: పూణెలో కారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ కేసులో దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను మహారాష్ట్రలో కాకుండా బాధితులు ఉన్న మధ్యప్రదేశ్‌లోనే జరపాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
మే 19న పూణె నగరంలో 17 ఏళ్ల బాలుడు మద్యం సేవించి పోర్స్చే కారు అతివేగంగా నడిపి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్స్.. అనీష్ అవధియా, అశ్విని కోష్టా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్విని జబల్‌పూర్‌కు చెందినవారు కాగా, అనీష్ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్ పాలికి చెందినవారు.
అశ్విని తండ్రి సురేష్ కుమార్ కోష్ట పిటిఐతో మాట్లాడుతూ, “మాకు న్యాయం జరిగేలా ఈ కేసులో దర్యాప్తు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి” అని అన్నారు. నిందితుడిని మైనర్‌గా కాకుండా పెద్దవాడిగా భావించి విచారించాలని, నేరం తీవ్రతను దృష్టిలోపెట్టుకొని విచారణ జరగాలని చెప్పారు. .
కాగా, ప్రమాదం (Pune Porsche Crash) తరువాత, యువకుడిని జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరుపరిచారు, 300 పదాల వ్యాసం రాయమని ఆదేశించి అతనికి బెయిల్ మంజూరు చేశారు.
కేసు నమెదైన కొన్ని గంటల్లోనే నిందితుడికి బెయిల్ మంజూరు కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రివ్యూ పిటిషన్‌పై నిరసన తర్వాత, JJB బుధవారం రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ కుమారుడిని జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోమ్‌కు రిమాండ్ చేసింది. యువకుడి తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నా చివరి శ్వాస వరకు న్యాయం కోసం పోరాడతాను అని అనిష్ తండ్రి ఓం ప్రకాష్ అవధియా తెలిపారు. కుటుంబాలకు న్యాయం జరిగేలా కేసు విచారణను పూణేలో కాకుండా మధ్యప్రదేశ్‌లో నిర్వహించాలని ఆయన అన్నారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పోలీస్ స్టేషన్‌లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రమాదాన్ని డబుల్ మర్డర్‌గా పరిగణించాలని అవధియా అన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..