Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించడం వెనుక కథేంటి?
Odisha | తాను ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాను సందర్శించినప్పుడు ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) వెల్లడించారు. దానిని ప్రధాని మోదీకి ఇవ్వమని పట్టుబట్టిందని తెలిపారు. అయితే ఈ సంఘటనకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
” నన్ను ఎప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను.” ఒడిశాలోని ఓ గిరిజన మహిళ 100 రూపాయల నోటును ఆ రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నాయకుడికి అందజేసింది. దానిని ప్రధానికి కృతజ్ఞతగా తెలియజేయమని వేడుకుంది. అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.
తాను ఒడిశా (Odisha) లోని సుందర్‌గఢ్ (Sundargarh district) జిల్లాను సందర్శించినప్పుడు, ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రికి ఆ డబ్బును ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. పాండా అది అవసరం లేదని ఆమెకు చెప్పడానికి యత్నించినప్పటికీ అమె ఒప్పుకోలేదు. చివరకు అతను ఆ నోట్‌ను తీసుకున్నానని వివరించారు.
అయితే ఈ ఘటన తనను ఎంతగానో కదిలించిందని ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను ఎల్లవేళలా ఆశీర్వదిస్తున్న మా నారీ శక్తికి నేను నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు విక్షిత్ భారత్‌ను నిర్మించేందుకు నిరంతరం కృషి చేసేందుకు నన్ను ప్రేరేపిస్తాయి” అని ప్రధాన మంత్రి తెలిపారు.
Very touched by this affection. I bow to our Nari Shakti for always blessing me. Their blessings inspire me to keep working to build a Viksit Bharat. https://t.co/Iw8m51zagY
— Narendra Modi (@narendramodi) October 19, 2024
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు