Wednesday, December 18Thank you for visiting
Shadow

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

Spread the love

Indiramma Housing Scheme | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ద‌శ‌ల వారీగా సుమారు 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో ఈ ఏడాది నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామని చెప్పారు.

ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొద‌టి విడ‌త‌లో సొంత స్థలం ఉన్న‌వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని, ఇక రెండో ద‌శ‌లో ప్ర‌భుత్వ‌మే నివాస స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిందని చెప్పారు. ఇందులో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం. దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌ గ‌ది, టాయిలెట్ క‌లిగి ఉంటాయి. గ‌త ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్య‌వ‌స్ధ ఉండేది. ఇప్పుడు ఆ వ్య‌వ‌స్థను ర‌ద్దు చేసి లబ్దిదారులే వారికి ఇష్టమైన రీతిలో ఇళ్లు నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు. అని మంత్రి పొంగులేటి తెలిపారు.
ల‌బ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం, ప‌ర్య‌వేక్ష‌ణ వ‌ర‌కు అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని తమ ప్రభుత్వం స‌మ‌కూర్చుకుంది. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామని చెప్పారు. .

READ MORE  TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..

లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

ఇందిరమ్మ లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు ప్రత్యేకం మొబైల్ యాప్ ను రూపొందించాం. ఇప్పటికే నాలుగు గ్రామాలు, నాలుగు మునిసిపాలిటీలలోని నాలుగు వార్డుల్లో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేశాం. సర్పంచ్ / వార్డు కౌన్సిలర్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం అమలు కోసం ప్రతి గ్రామ పంచాయితీ, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశాం. ప్రతి మండల కేంద్రంలోని ఎం‌పి‌డిఓ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 34,544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ.305 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ఈ ఇండ్లను పంపిణీ చేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

READ MORE  EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *