Hyderabad polytechnic colleges | ప్రభుత్వ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యను విస్తరించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కింది కాలేజ్ లను ఉన్నతీకరించాలని నిర్ణయించారు.
- గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ – ఈస్ట్ మారేడ్‌పల్లి
- గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ – ఈస్ట్ మారేడ్‌పల్లి
- జెఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్- రామంతపూర్,
- కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్- ఓల్డ్ సిటీ,
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ – అమీర్‌పేట్,
- మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ (మైనారిటీస్) – బడంగ్ పేట
నివేదికల ప్రకారం.. దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ , మారేడ్‌పల్లి పాలిటెక్నిక్‌లలో CSE, రామంతపూర్ పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరింది. ఇప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనకు విద్యాశాఖ ఆమోదం తెలిపింది. అలాగే ప్రతిపాదిత కళాశాలలకు ఆర్థికపరమైన చిక్కులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్లు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను బోధించడానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లేబొరేటరీలు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 57 Polytechnic colleges
“ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తరువాత, 2025-26 విద్యాసవంత్సరంలో అప్‌గ్రేడ్ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతి కోరనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 57 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉండగా, 12 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో, ప్రభుత్వం కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి, రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా నిలిచింది. ఈ కళాశాలను CSE, CSE (AI మరియు ML), CSE డేటా సైన్స్ ప్రోగ్రామ్‌లను ఒక్కొక్కటి 60 సీట్లతో ప్రారంభించింది. TG EAPCETలో పొందిన మెరిట్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాలు జరిగాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..