Wed in India | ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?
తన తదుపరి మిషన్ “వెడ్ ఇన్ ఇండియా (Wed in India)” అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ని జరిగిన వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ & కాశ్మీర్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రధాని సూచించారు. అలా చేయడం వల్ల ప్రతీ వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు దీనివల్ల ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వివరించారు.
ఇప్పుడు వెడ్ ఇండియా కార్యక్రమం కింద ప్రజలు వివాహం (wedding) కోసం ఇక్కడికి రావాలని కోరారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి వివాహాలు చేసుకుంటున్నాయని, పేర్కొన్నారు. ఇలాంటి వారి కారణంగా దాదాపు రూ.75,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో జరిపితే ఆ డబ్బు దేశంలోనే ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు .
ఈ నేపథ్యంలో ఛలో ఇండియా కార్యక్రమం కింద, ఎన్నారైలు (NRIs) కనీసం ఐదుగురు కుటుంబ సభ్యులను భారతదేశానికి పంపాలని కోరుతున్నట్లు మోదీ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుతుందని, ప్రధాని తెలిపారు. మరోవైపు 370 ఆర్టికల్ విషయంలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు.
మిషన్ డెస్టినేషన్ వెడ్డింగ్..
గత నవంబర్‌లో మోదీ తన ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో .. కొన్ని “పెద్ద కుటుంబాలు” విదేశాలలో వివాహాలను నిర్వహించడం వల్ల ఇబ్బదులు ఎదురవుతాయని అన్నారు .’మేక్ ఇన్ ఇండియా’ మాదిరిగానే దేశంలో ‘వెడ్ ఇన్ ఇండియా’ అనే కొత్త ఉద్యమం చేపట్టాలన్నారు. డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు (Destination Wedding) జరపాలని భారతీయులకు విజ్ఞప్తి చేశారు .
ప్రధానమంత్రి అభ్యర్థన వెనుక కారణం స్పష్టంగా ఉంది. భారతదేశానికి చెందిన డబ్బు.. దేశ సరిహద్దులు దాటొద్దని, అది ఇక్కడివారికే ఉపయోగపడాలని ప్రధాని ఉద్దేశం..
“భారతేతర జంటలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భారత్ కు రావడం ప్రారంభిస్తే, అది భారతీయ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక విక్రేతలకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లను దేశంలోనే నిర్వహించేందుకు భారతీయులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తే, కొన్ని మార్పులు అవసరమని చెబుతున్నారు. భారతీయ హోటల్‌లు లేదా బాంకెట్ హాల్స్ ఛార్జీలను తగ్గించాలని, వివాహాల సీజన్‌లో, ఈ బాంకెట్ హాల్స్, హోటళ్లు సాధారణ మొత్తం కంటే రెట్టింపు వసూలు చేస్తాయని ఈ విషయంలో మార్పు రావాలని కోరుతున్నారు “భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లను నిర్వహించడానికి అవసరమైతే. విజయవంతం కావడానికి, మంచి బాంకెట్ హాళ్లను నిర్మించడంతోపాటు భారీ మార్పులు తీసుకురావాలంటున్నారు.
భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం స్థలాలను పరిశీలిస్తే.. గోవా, రాజస్థాన్, హిమాచల్, అండమాన్‌లు భారతదేశంలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లను కోసం అనువైనవిగా గుర్తింపు పొందాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..