ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ ‘బానిసలుగా ఉన్న భారతీయ విద్యావ్యవస్థను పూర్వవైభవం తీసుకురావవానికి ప్రతి భారతీయుడు 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు.
ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “1835 నాటి ఇంగ్లీష్ విద్యా చట్టం ద్వారా మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశాడు. భారతీయ విద్యావ్యవస్థను చెత్తబుట్టలో పడేశాడు. పాశ్చాత్య విద్యావ్యవస్థను అవలంబించాలని మనల్ని నమ్మించింది,” అని అన్నారు. వలసవాద మనస్తత్వం యొక్క సంకెళ్ల నుండి బయటపడాలని, తద్వారా 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కలను సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.
రాముడి విలువలు, మానసిక బానిసత్వం
“రాముడు ఒక సంపూర్ణ విలువల వ్యవస్థను కలిగి ఉన్నాడు. ప్రతి భారతీయుడి ఇంట్లో, ప్రతి భారతీయుడి హృదయాల్లో రాముడు కొలువై ఉన్నాడు. మానసిక బానిసత్వం యొక్క మనస్తత్వం ఎంతగా వ్యాపించిందంటే, రాముడు కూడా కొన్నిసార్లు ఊహాత్మకమైనదిగా ఆరోపించారు. మనం మనల్ని దృఢంగా నిశ్చయించుకుంటే, ఈ మానసిక బంధనం నుండి మనం విముక్తి పొందవచ్చు,” అని ప్రధాని మోదీ అన్నారు.
లార్డ్ మెకాలే ఎవరు?
థామస్ బాబింగ్టన్ మెకాలే ఒక బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయ నాయకుడు. భారతదేశంలో విద్యా వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించించాడు.1835 ఆంగ్ల విద్యా చట్టం (Macaulay’s Minute) భారతీయ విద్యావ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. ఈ చట్టం సంస్కృతం, అరబిక్ వంటి సాంప్రదాయ భారతీయ అభ్యాసానికి బదులుగా పాశ్చాత్య విద్యా విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది. బోధనా మాధ్యమంగా ఆంగ్లం: పాఠశాలలు, కళాశాలలలో ఆంగ్లాన్ని ఏకైక బోధనా మాధ్యమంగా మార్చింది.
సంస్కృతం, అరబిక్ పుస్తకాల ముద్రణకు నిధులు నిలిపివేయాలని మెకాలే ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదేశించాడు. వారి స్థానిక మూలాలు ఉన్నప్పటికీ ‘బ్రిటిష్ మనస్తత్వం’ ఉన్న భారతీయుల తరగతిని సృష్టించడం ఈ చట్టం అంతిమ లక్ష్యం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


