PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది.
ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి.. నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని కొనియాడారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
స్వర్వేద్ మహామందిర్ గురించి వాస్తవాలు..
స్వర్వేద్ మహామందిర్ వారణాసి సిటీ సెంటర్ నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది. ఇది 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఈ ఆలయం 20,000-సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 125-రేకుల తామర గోపురాలతో అందమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఈ ధ్యానమందిరానికి సంత్ ప్రవర్ విజ్ఞాన్ దేవ్, సద్గురు ఆచార్య స్వతంత్ర దేవ్ 2004లో పునాది వేశారు.
ఈ భవన నిర్మాణానికి 15 మంది ఇంజనీర్లు, ఆరు వందల మంది కార్మికులు శ్రమించారు.
ఈ ఆలయంలో 101 ఫౌంటైన్లు, టేకు చెక్క తలుపులు, పైకప్పులు ఉన్నాయి.
మహామందిర్ అని పిలువబడే ఏడు అంతస్తుల నిర్మాణం గోడలపై స్వర్వేదంలోని శ్లోకాలను ముద్రించారు.
గోడలు పింక్ ఇసుకరాయితో అలంకరించబడి ఉంటాయి. ఔషధ మొక్కలతో నిండిన మనోహరమైన గార్డెన్ తో మరింత అందాన్ని ఇస్తుంది.
సద్గురు శ్రీ సదాఫల్ డియోజీ మహారా రచించిన ఆధ్యాత్మిక సాహిత్యం స్వర్వ్ పేరు మీదుగా ఈ ఆలయానికి పేరు పెట్టారు.
ఈ ఆలయం బ్రహ్మ విద్యపై దృష్టి సారించి స్వర్వేద బోధనలను ప్రచారం చేస్తుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.