Sunday, April 6Welcome to Vandebhaarath

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

Spread the love

PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది.

ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.

READ MORE  Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..
Modi Followers
Modi Followers

భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి ఇతర ప్రముఖ నేతల ఫాలోవర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది, సోషల్ మీడియా రీచ్‌లో ప్రధాని మోదీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొన‌సాగిస్తున్నారు.


ఎక్స్‌లో PM మోడీకి ఉన్న ప్రజాదరణ చాలా మంది ప్రపంచ క్రీడాకారులు, సెలబ్రిటీలను మించిపోయింది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి 64.1 మిలియన్ల మంది, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్‌కు 63.6 మిలియన్ల మంది, అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్‌కు 52.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్లు), లేడీ గాగా (83.1 మిలియన్లు), కిమ్ కర్దాషియాన్ (75.2 మిలియన్లు) వంటి ప్రఖ్యాత సెలబ్రిటీలు కూడా ఫాలోవర్ల సంఖ్య పరంగా PM మోడీ కంటే వెనుకబడి ఉన్నారు.

READ MORE  Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..
X Followers for modi
X Followers

గత మూడేళ్ల‌లో PM మోదీ X హ్యాండిల్ సుమారు 30 మిలియన్ల వినియోగదారులను పెంచుకుంది. అనేక మంది సాధారణ పౌరులను ఫాలో కావ‌డం, వారితో సంభాషించడం, వారి సందేశాలకు రిప్లై ఇవ్వడం కోసం PM మోడీ Xని ఉపయోగిస్తారు.

యూట్యూబ్ లోనూ దూసుకెళ్తున్నారు..

PM Modi followers : ప్రధానమంత్రి మోదీ ప్రభావం X దాటి విస్తరించింది. YouTubeలో, మోదీకి దాదాపు 25 మిలియన్ల మంది స‌బ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు. Instagramలో, 91 మిలియన్లకు పైగా ఫాలోవ‌ర్లను కలిగి ఉన్నారు. 2009లో Xలో చేరినప్పటి నుండి ఆయ‌న‌ సోషల్ మీడియాను స్థిరంగా ఉపయోగించడం వలన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అనుచ‌రుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసింది.

READ MORE  Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *