కర్ణాటకలోశాంతిభద్రతలపై దేశం ఆందోళన చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమవుతారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది” అని ప్రధాని అన్నారు.
హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహా(23) ఏప్రిల్ 18న బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో కత్తితో హత్య (Hubballi murder case )కు గురైంది. కత్తిపోటు అనంతరం ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడు ఫయాజ్ ఖోండునాయక్‌ను అరెస్టు చేశారు. నేహా మొదటి సంవత్సరం MCA విద్యార్థిని కాగా, దుండగుడు ఫయాజ్ ఆమె మాజీ క్లాస్‌మేట్.
కాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు కాంగ్రెస్ పార్టీని ప్రధాని విమర్శించారు. “ఓటు బ్యాంకు ఆకలితో ఉన్నవారు రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు, మరోవైపు ఇక్బాల్ అన్సారీ కుటుంబం మొత్తం మూడు తరాల పాటు రామాలయంపై కేసు వేసి పోరాడింది, అయితే సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది, అన్సారీని రామాలయం ధర్మకర్తలు ఆహ్వానించినప్పుడు, అతను ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యాడు,” అని మోదీ చెప్పారు.
లోక్‌సభ రెండో విడత ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..