Friday, April 25Thank you for visiting

Petrol diesel prices cut పెట్రో, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం …

Spread the love

Petrol Diesel Prices Cut in India: లోక్ సభ ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్వ‌ల్ప‌ ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.2 తగ్గించినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ వివరాలు షేర్ చేశారు. ఈ  ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు.

‘‘పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం వల్ల దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యం కోసం ప్రధాని మోదీ నిరంతరం పని చేస్తున్నట్లుగా మరోసారి నిరూపించారు” అని కేంద్ర మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘మార్చి 14, 2024 రూపాయి విలువ ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున రూ.94 అయితే ఇటలీలో రూ.168.01గా ఉంది అంటే 79 శాతం ఎక్కువ, ఫ్రాన్స్‌లో రూ.166.87గా ఉంది అంటే..  78 శాతం ఎక్కువ, జర్మనీలో రూ.159.57, స్పెయిన్‌లో రూ.145.13  ఉంది” అని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.

READ MORE  Bangladesh-India | భారతదేశం మాల్దీవులకు సహాయం పెంపు.. బంగ్లాదేశ్ భార‌త్ ఏంచేసింది?

లోక్‌సభ ఎన్నికల కోడ్  అమలుకు ముందు గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న అనేక ఉపశమన చర్యలలో ఈ ప్రకటన కూాడా ఒకటి. వారం రోజుల క్రితమే, ప్రభుత్వం దేశీయ వంట గ్యాస్ ధరలను 100 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు LPG సిలిండర్‌ల కోసం ₹ 300 సబ్సిడీని రాబోయే ఆర్థిక సంవత్సరానికి (FY25)  12,000 కోట్లతో పొడిగించిన విషయం తెలిసిందే.. 

READ MORE  ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..