పరకాల బిజెపి నేత, డాక్టర్ కాళీ ప్రసాద్
కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి వారికోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని బిజెపి నేత డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) అన్నారు. గొర్రెకుంట (Gorrekunta)లో అంబేద్కర్ సెంటర్ వద్ద 15 డివిజన్ అధ్యక్షుడు ల్యాదెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26 (Union Budget 2025) లో 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు పన్ను రద్దు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పరకాల (Prakala) కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) హాజరై బిజెపి నాయకులతో కలిసి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రద్దుతో చాలా వరకు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఉపశమనం లభించిందని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితువు పలికారు. లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
12లక్షల ఆదాయ పన్ను పరిమితి విధించడం శుభ పరిణామం. మోదీ రైతు పక్షపాతి అందుకే కేంద్రం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. వ్యవసాయ రంగానికి కోటి 74 లక్షలు కేటాయించారు. 6 కొత్త పథకాలు ప్రజల కోసం ప్రారంభించనున్నారు. పండ్లు, కూరగాయల అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ పరిశోధనల కోసం నిధులు భారీగా కేటాయించారు. విద్యా రంగానికి, ఆరోగ్య , యువత ఉపాధికి పెద్ద పీట వేశారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ లకు అభివృద్ధి కనిపించడం లేదా? పాఠ్యాంశాలలో AI టెక్నాలజీని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. PM అవాస్ yojana నిధులతో ఇల్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేని పథకం ఏంటో చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలి. లంగాణ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం అని కాళీ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ మెంబర్ బిల్లా రమేష్ జిల్లా ఓబీసీ నాయకులు ఆడెపు రమేష్, రుద్రారపు శివకుమార్ డివిజన్ ఉపాధ్యక్షులు రాజేష్ గౌడ్ డివిజన్, మహిళా అధ్యక్షురాలు ఎల్.సంధ్య లింకపల్లి స్వామి, తలుగుల అనిల్, బూత్ అధ్యక్షులు జెల్లా నాగరాజు, కొట్టే భవాని, నారెడ్ల రాములు, మంద కోర్నెల్, నవనీత రావు, మల్లికార్జున్ ,కందుల రవివర్మ, అన్వేష్, శివకోటి ,పిల్లల రవీందర్ గౌడ్, బందెల రేణుక, పోలేపాక కళ్యాణ్ బాబు, రాజ్ కుమార్, రజిత అఖిల్, కల్పన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.