
Pahalgam terror attack : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన టూరిస్టులపై అత్యంత పాశవికగా దాడి చేశారు. ఈ ఘటనలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే.
బైసారన్ మైదానంలో ఈ దాడి జరిగింది. ఇది కాలినడకన లేదా గుర్రాల మీద మాత్రమే చేరుకోగల సుందరమైన ప్రదేశం. ఆ సమయంలో పర్యాటకుల బృందం సందర్శిస్తోంది. సంవత్సరాల తరబడి ఉగ్రవాదం నుంచి కోలుకుంటున్న కాశ్మీర్‌లో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉగ్ర దాడి సంఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకులపై దాదాపు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు.
ముష్కరులకు ప్రధాని మోదీ హెచ్చరిక
ఈ దారుణ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర దుఃఖం.. ఆగ్రహాన్ని రేకెత్తించింది. హంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేశారు. “జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధిత వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తాం.. ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని న్యాయం ముందు నిలబెట్టాలి… వారిని వదిలిపెట్టబోము! వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనది.. అది మరింత బలపడుతుంది” అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.