Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?
Ovitrap Baskets | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) నమోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు.
“పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తాయి. ఈ బుట్టలను ఇళ్లకు 20 అడుగుల దూరంలో అమర్చారు. లోపల స్ప్రే చేసిన రసాయనం దోమలను ఆకర్షిస్తుంది, వాటిని బుట్టలోకి రప్పిస్తుంది. ఈ వినూత్న ప్రయోగం డెంగ్యూ దోమల నివారణకు మరింత దోహదపడుతుందని ఎక్స్‌లో దినేష్ గుండూరావు అన్నారు.
Our @DHFWKA health department has initiated a new pilot project to control dengue. We have started installing Ovitrap baskets that attract mosquitoes. This innovative project was launched today in Gopalapura, Magadi Road, Gandhinagar Assembly constituency.
Ovitraps used for… pic.twitter.com/B1CeWdbRIT
— Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) August 26, 2024
ఓవిట్రాప్ బుట్టలు ఎలా పని చేస్తాయి?
ఓవిట్రాప్ బుట్టలు దోమలను ఆకర్షించడానికి, ట్రాప్ చేయడానికి రూపొందించబడిన ప్రత్యేక పరికరాలు. ప్రత్యేకించి ఈడెస్ ఈజిప్టి, ఈడెస్ ఆల్బోపిక్టస్ వాటిని ఆకర్షిస్తాయి. నీటితో నిండిన డార్క్ కంటైనర్ లో దోమలు గుడ్లు పెట్టడానికి అనుకూలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి, పెద్ద దోమలు ప్రవేశించిన తర్వాత తప్పించుకోకుండా నిరోధించేందకు పైన మెష్ ఉంటుంది.
గుడ్లను సేకరించడం ద్వారా దోమల జనాభాను నియంత్రించడం ఓవిట్రాప్‌ల ప్రధానమైన పని. అవి పెట్టిన గుడ్లు కింద ఉన్న నీటిలో పడిపోతాయి. దీని సాయంతో దోమలు వృద్ధి చెందే హాట్‌స్పాట్‌లను అంచనా వేయవచ్చు. అలాగే వెక్టర్ నియంత్రణ చర్యలను ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. Ovitraps కొన్ని పురుగు మందులను కలిగి ఉంటాయి, ఇవి ప్రవేశించే దోమలను లేదా ఉచ్చులో అభివృద్ధి చెందుతున్న లార్వాలను చంపుతాయి, తద్వారా దోమలను నియంత్రిస్తుంది. ఓవిట్రాప్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా, ఆరోగ్య అధికారులు ఇది ఉంచిన ప్రాంతంలో ఏడెస్ దోమల ఉనికిని, వృద్ధిని అంచనా వేయవచ్చు. ఇది దోమల వ్యాప్తిని ముందస్తుగా గుర్తించడంలో సహాయపడుతుంది.. సకాలంలో ముందస్తుచ ర్యలు తీసుకోవచ్చు.
చక్కని పరిష్కారాలు
దోమల వృద్ధిని పర్యవేక్షించడానికి ఓవిట్రాప్‌లు చాలా కాలంగా సమర్థవంతమైన ఒక నిఘా సాధనాలుగా గుర్తించారు. కంటైనర్-బ్రీడింగ్ దోమల ఉనికిని గుర్తించవచ్చు. బ్రీడింగ్ హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి, వెక్టర్ నియంత్రణకు ప్లాన్ చేయడానికి ఇది చాలా కీలకం. ఇవి దోమలను ఆకర్షించడమే కాకుండా వాటిని సంహరించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు.
ఈ ఉచ్చులు ఎదిగిన దోమల జనాభాను గణనీయంగా తగ్గించగలవని అనేక ప్రయోగాలు నిర్ధారించాయి. ఉదాహరణకు, ఇతర నియంత్రణ చర్యలతో పాటుగా ఈ ఓవిట్రాప్‌లను ప్రవేశపెట్టిన తర్వాత స్టిక్కీ ఓవిట్రాప్‌లలో బంధించబడిన ఈడెస్ ఈజిప్టి ఆడవారి సంఖ్య 87 శాతం తగ్గినట్లు ఒక అధ్యయనం నివేదించింది.
కాపర్ బేస్డ్ ద్రావణాల వంటి లార్విసైడ్‌లతో నిండిన ఓవిట్రాప్‌లు దోమల లార్వాలను సమర్థవంతంగా తొలగిస్తాయని కొన్ని పరీక్షలు నిరూపించాయి . ఇండోనేషియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో, కాపర్ ట్రీట్ మెంట్ చేసిన ఓవిట్రాప్‌లు పెద్ద సంఖ్యలో లార్వాలను చంపేశాయి.
డెంగ్యూ, జికా, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల వాహకాలు అయిన దోమల జనాభాను నియంత్రించడానికి అనేక దేశాలు ఓవిట్రాప్ బుట్టలను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు హాంకాంగ్, సింగపూర్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాలు డెంగ్యూ వాహకాలపై సాధారణ నిఘా కోసం ఓవిట్రాప్‌లను ఉపయోగిస్తున్నాయి. లార్వా సర్వేల కంటే ఓవిట్రాప్ సర్వేయింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే ఇది అపరిపక్వ దోమలను మాత్రమే కాకుండా గ్రావిడ్ దోమలు పెట్టే గుడ్లను కూడా చురుకుగా గుర్తిస్తుంది.
విదేశాల్లో విజయవంతం
ఇండోనేషియాలో, దోమల లార్వాలను సమర్థవంతంగా తొలగించడానికి ఎక్కువగా ఓవిట్రాప్‌లను ఉపయోగించారు. పశ్చిమ సుమత్రాలోని పైనాన్ సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో, 10 ppm సాంద్రత కలిగిన రాగితో నిండిన ఓవిట్రాప్‌లు పెద్ద సంఖ్యలో ఏడెస్ spp మొదటి రెండవ దశ లార్వా చనిపోయినట్లు కనుగొన్నారు. ఫిలిప్పీన్స్ లో డెంగ్యూ నివారణ కార్యక్రమాలలో భాగంగా లార్విసిడల్ ఓవిట్రాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ ఉచ్చులు లార్వాలను మాత్రమే చంపినప్పటికీ, అవి డెంగ్యూ వ్యాప్తిని భారీగా తగ్గించాయి. ఒక ప్రాంతం డెంగ్యూ కేసులు 97 శాతం తగ్గిపోయాయి. యునైటెడ్ స్టేట్స్‌లో ఓవిట్రాప్‌లను US సైనిక పరిశోధన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ట్రాప్-ఎన్-కిల్, BG-GAT వంటి బ్రాండ్ పేర్లతో అందుబాటులో ఉన్నాయి. మేరీల్యాండ్‌లోని యూనివర్శిటీ పార్క్‌లో ఆసియా టైగర్ దోమలను తగ్గించడానికి ఈ ఉచ్చులు విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.
భారతదేశంలో..
Ovitrap Baskets భారతదేశంలో, ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో అమలు చేస్తున్నారు. సోనిత్‌పూర్ జిల్లాలో నిర్వహించిన పరిశోధనలో డెంగ్యూ వెక్టర్స్, ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ స్పాటియోటెంపోరల్ వ్యాప్తిని నియంత్రించడానికి ఉపయోగించారు. ఈ అధ్యయనం.. ఎంపిక చేసిన గ్రామాల్లో ఓవిట్రాప్‌లను ఉంచడం ద్వారా.. ఏడాది పొడవునా దోమల లార్వాపై డేటాను సేకరించడం ద్వారా డెంగ్యూ వ్యాప్తికి అధిక-రిస్క్ జోన్‌లను గుర్తిస్తున్నారు. ఈ పరిశోధన నుంచి కనుగొన్న విషయాలు దోమల జనాభాను, వాటి సంతానోత్పత్తి విధానాలను అంచనా వేయడంలో ఓవిట్రాప్‌ల చక్కగా ఉపయోగపడ్డాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..