
Oscars 2025 Winners List | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా వెల్లడైంది. ‘ది బ్రూటలిస్ట్’ చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘అనోరాస ఎంపికైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా ఇప్పుడు వెల్లడైంది. ఈ పూర్తి లిస్ట్ ఇదే..
Oscars 2025 Winners List : 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు హాలీవుడ్ లోని ప్రముఖ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త దుస్తులలో కనిపించి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది.
ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక అవార్డుల విజేతలను కూడా దిగ్గజ హాలివుగడ్ ప్రముఖ మధ్య కోలాహలంగా ప్రకటించారు. ‘ది బ్రూటలిస్ట్’ చిత్రానికి గాను అడ్రియన్ బ్రాడీ (Adrien Brody) ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు, ‘అనోరా(Anora)’ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు.97వ ఆస్కార్ అవార్డుల పూర్తి విజేతల జాబితాను పరిశీలిద్దాం…
Oscars 2025 Winners List : 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా
- ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్)
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ది షాడోస్ ఆఫ్ ది సైప్రస్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వికెడ్ (పాల్ టేజ్‌వెల్)
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కాన్క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్)
- ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్: ది సబ్‌స్టెన్స్
- ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా (ఎమిలియా పెరెజ్)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వికెడ్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఎమిలియా పెరెజ్ సే ఎల్ మాల్ (క్లెమెంట్ డుకోల్, కామిల్లె మరియు జాక్వెస్ ఆడియార్డ్)
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నో అదర్ ల్యాండ్
- ఉత్తమ సౌండ్: డ్యూన్ – పార్ట్ 2
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్ – పార్ట్ 2
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఐ యామ్ నాట్ ఎ రోబోట్
- ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది బ్రూటలిస్ట్ (డేనియల్ బ్లంబర్గ్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది బ్రూటలిస్ట్ (లాల్ క్రౌలీ)
- ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం: ఐయామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్)
- ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (The Brutalist)
- ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (Sean Baker) (అనోరా)
- ఉత్తమ నటి: మిక్కీ మాడిసన్ (Anora)
- ఉత్తమ చిత్రం: అనోరా
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.