అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch
దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నీరు ధూళి నిరోధకత కోసం IP68-రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
స్మార్ట్‌వాచ్ ధర
NoiseFit Vortex స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 2,999. వీటి అమ్మకాలు జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వాచ్‌ని NoiseFit వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, వింటేజ్ బ్రౌన్, రోజ్ పింక్, స్పేస్ బ్లూ అనే మూడు విభిన్న కలర్ వేరియంట్‌లలో వస్తుంది.
NoiseFit Vortex Smartwatch స్పెసిఫికేషన్‌లు
NoiseFit వోర్టెక్స్ స్మార్ట్‌వాచ్ 1.46-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వృత్తాకార డయల్‌ను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్‌లో రెండు ఫిజికల్ సైడ్ బటన్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ట్రూ సింక్ టెక్నాలజీతో నడిచే బ్లూటూత్ కాలింగ్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వాచ్ డిస్‌ప్లే నుండి నేరుగా ఫోన్ కాల్‌లు చేయవచ్చు అలాగే స్వీకరించవచ్చు.
అదనంగా, స్మార్ట్‌వాచ్‌లో 150 కంటే ఎక్కువ కస్టొమైజ్డ్ వాచ్ ఫేస్‌లు, రన్నింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇది SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ సెన్సార్‌లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ నీరు, ధూళి నిరోధకత కోసం IP68-రేట్ ఉంటుంది. బ్లూటూత్ 5.3 ఫీచర్లను కలిగి ఉంది.
నోయిస్‌ఫిట్ వోర్టెక్స్ స్మార్ట్‌వాచ్ ఒక్క ఛార్జ్‌పై ఒక వారం వరకు పని చేస్తుందని క్లెయిమ్ చేయబడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ లభ్యమయ్యే నోయిస్‌ఫిట్ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్ వినియోగదారులు వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుందని కంపెనీ చెబుతోంది.