Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్
కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌ల ( Containment zones )ను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించింది. నిఫా రోగులతో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య 700గా ఉండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 700 మందిలో 77 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో Nipah Virus అప్‌డేట్‌లు
1. హై రిస్క్ ఉన్న నిపా రోగులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు.
2. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు.
3. కోజికోడ్ జిల్లా (Kozhikode district) లోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో అత్యవసర సేవల కోసం మాత్రమే రాకపోకలను అనుమతించారు.
నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తారు. ఫార్మసీలు, ఆరోగ్య కేంద్రాలు నిరంతరం తెరిచే ఉంటాయి. కంటైన్‌మెంట్ జోన్ల గుండా జాతీయ రహదారులపై తిరిగే బస్సులు లేదా వాహనాలు ప్రభావిత ప్రాంతాల్లో ఆగకూడదు.
4. కోజికోడ్‌లో తొమ్మిదేళ్ల బాలుడు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. బాలుడికి సత్వరమే మెరుగైన చికిత్స చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
5. నిఫా రోగులను సుమారు 700 మంది సంప్రదించారు. వారిలో 76 మంది ప్రమాదంలో ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
6. ఈసారి కోజికోడ్‌లో మాత్రమే వ్యాప్తి చెందగా, డబ్ల్యూహెచ్‌ఓ(WHO) ఐసిఎంఆర్(ICMR) అధ్యయనాల ప్రకారం కేరళ మొత్తం ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉందని మంత్రి వీణా జార్జ్ అన్నారు.
7. ఈసారి కేరళలో కనుగొనబడిన నిపా జాతి బంగ్లాదేశ్ వేరియంట్, ఇది తక్కువ అంటువ్యాధి కాని మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ జాతి మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది.
8. నిపా అనేది జూనోటిక్ వైరస్ , ఇది సోకిన జంతువులు లేదా కలుషితమైన ఆహారం నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఆపై అది ఒక సోకిన వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటి లక్షణాలు తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపుగా మారి బ్రెయిన్ డెత్‌కు దారితీస్తాయి.
9. కేరళలో ఇంతకుముందు నిపా వ్యాప్తి జరిగింది. 2018లో ఒకసారి, 2019, 2021లో కొన్ని కేసులు నమోదయ్యాయి. 2018లో 18 మంది రోగులలో 17 మంది మరణించారు.
10. కేరళలో నిపా వ్యాప్తి కారణంగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాను అప్రమత్తం చేసింది. జిల్లాలోకి వచ్చే గూడ్స్ వాహనాలను తనిఖీ చేసేందుకు సరిహద్దు పాయింట్ల వద్ద చెక్‌పోస్టులను తెరవాలని ఆరోగ్య శాఖ పోలీసులను కోరింది. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే పండ్లను తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.