Railway Rules | వెయింటింగ్ టిక్కెట్లపై మారిన నిబంధనలు.. ఈ చిన్న తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..
Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మన రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జనాభాతో సమానం. మన దేశంలో చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు.
అయితే సుదూర ప్రయాణాలకు ప్రజలు సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా మంది ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్ టికెట్లు అంత సులువుగా దొరకవు. త్వరత్వరగానే అయిపోతుంటాయి. చివరకు వెయిటింగ్‌లో టిక్కెట్లు లభిస్తాయి. గత్యంత్రం లేక చాలా మంది ఈ వెయిటింగ్ టికెట్‌తోనే ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న తప్పు చేసినా భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
వెయిటింగ్ టిక్కెట్‌పై జరిమానా
భారతీయ రైల్వేలో రెండు రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్ టికెట్, రెండోది ఆఫ్‌లైన్ టికెట్, ఎవరైనా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను బుక్ చేసి, టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళితే. అప్పుడు ఆ టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే ఒక ప్రయాణీకుడు ఆఫ్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళుతుంది. కాబట్టి ఆ వెయిటింగ్ టికెట్ రద్దు కాదు.
ఆ వెయిటింగ్ టికెట్‌పై ప్రయాణీకుడు కూడా ప్రయాణించవచ్చు. చాలా సార్లు ప్రయాణీకులు ఆఫ్‌లైన్ వెయిటింగ్ టిక్కెట్లు తీసుకొని రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణించడం సాధారణంగా కనిపించింది. అయితే ఒక ప్రయాణికుడు ఇలా చేస్తే. అప్పుడు అతనికి రూ.440 జరిమానా విధించవచ్చు. ఇది మాత్రమే కాదు, TTE కావాలనుకుంటే, తదుపరి స్టేషన్‌లో రైలు నుంచి అటువంటి ప్రయాణీకులను కూడా దింపివేసే అవకాశం కూడా లేకపోలేదు.
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవచ్చు
ఎవరైనా రైల్వే రిజర్వ్‌డ్ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తే. రైల్వే అతనిపై చర్య తీసుకోవడమే కాకుండా జరిమానా కూడా విధించవచ్చు. నిజానికి, TTE కి అతన్ని రైలు నుంచి కిందకు దించే అధికారం ఉంటుంది. అయితే వెయిటింగ్ టికెట్‌పై ఉన్న ప్రయాణికుడు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తే. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Railway Rules వాస్తవానికి, వెయిటింగ్ టిక్కెట్లతో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకూడదనే నిబంధన రైల్వేలో ఇప్పటికే ఉంది. అయితే ఈ నిబంధన సక్రమంగా పాటించడం లేదు. ప్రయాణికులు రిజర్వ్ కోచ్‌లలో వెయిటింగ్ టిక్కెట్‌లతో చాలా మంది ప్రయాణికులు ఎక్కుతున్నారని రైల్వేకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రైల్వేశాఖ అధికారులను ఆదేశించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..